శ్రీ రమణీయ భావనల సేవధియై చెలువారు సాహితీ
సారము సద్రసజ్ఞ తతి స్వాంతము లందు సుధార్ణవంబులైబారగ జేయు సాధనము భాషయె; భాషకు తల్లి యైన ఆ
భారతి సాహితీ విబుధ వర్గము నేలుత గూర్చి వాగ్ఝరుల్!
భక్తి వికాసమై బరగు వ్రాతల నాత్మ వికాస దీప్తియున్;
రక్తియు, సాధనా పటిమ, శ్రద్ధయు, శీలము, కార్య దీక్ష, లా
సక్తియు, స్థైర్య ధైర్యములు, జాగృతి, వస్తువులైన చేతనా
సక్త కవిత్వ రూపమగు శారద యేలుత సాహితీ భువిన్!
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment