వర వల్లకీ పాణి జలజాత భవురాణి
ప్రణుతింతు భారతీ శరణు శరణో జనని!
ప్రణుతింతు భారతీ శరణు శరణో జనని!
అలివేణి సుమపాణి మృదుల సైకత శ్రోణి
శరదిందు చంద్రికా దరహాస లసితాస్య
పల్లవారుణ కాంతి పరి శోభితాంఘ్రి
పరమ పావన చరిత కల్యాణి శుభదాయి !!వర వల్లకీ!!
శరదిందు చంద్రికా దరహాస లసితాస్య
పల్లవారుణ కాంతి పరి శోభితాంఘ్రి
పరమ పావన చరిత కల్యాణి శుభదాయి !!వర వల్లకీ!!
హంసవాహిని పుస్తకాంభోజ శుకపాణి
జ్ఞానదాహిని సరస స్నిగ్ధ వాగౄపిణి
వేదవేదాంతాది విద్యా స్వరూప
సావిత్రి గాయత్రి విశ్వ జనయిత్రి !!వర వల్లకీ!!
జ్ఞానదాహిని సరస స్నిగ్ధ వాగౄపిణి
వేదవేదాంతాది విద్యా స్వరూప
సావిత్రి గాయత్రి విశ్వ జనయిత్రి !!వర వల్లకీ!!
అక్షరాంతర లసిత మంగళ ప్రదాత్రి
భవ్య భాషాభోగ తత్త్వ ప్రదీప్తా
కవిపండిత స్వాంత సంస్రవిత భావ
సాహిత్య సంగీత సాలోచనామృతా !!వర వల్లకీ!!
భవ్య భాషాభోగ తత్త్వ ప్రదీప్తా
కవిపండిత స్వాంత సంస్రవిత భావ
సాహిత్య సంగీత సాలోచనామృతా !!వర వల్లకీ!!
భక్త తోషిణి ఘోర భవ రోగ నాశని
మంజు భాషిణి విమల పద్మ వన వాసినీ
ఆనంద శివకరి అజ్ఞాన భంజని
సార సారస్వతీ మాత కరుణాంతరంగా !!వర వల్లకీ!!
మంజు భాషిణి విమల పద్మ వన వాసినీ
ఆనంద శివకరి అజ్ఞాన భంజని
సార సారస్వతీ మాత కరుణాంతరంగా !!వర వల్లకీ!!
No comments:
Post a Comment