భార్గవ రాముడు
పరశు రాముడు తన తండ్రి జమదగ్నిని వధించిన క్షత్రియ సంతతిపై ప్రతీకారేచ్ఛతో ఇరువది యొక్క మార్లు ప్రపంచాన్ని చుట్టి క్షత్రియులను సంహరించాడని విన్నాం. కాని ఆతని దండ యాత్ర ప్రతీకారేచ్ఛతో కాదు అది ఆనాటి అధర్మ వర్తనులైన వారిపైనే అని నా భావన. అంతే కాదు తాను సాధించిన భూమండలాన్ని మొత్తంగా కశ్యప మహర్షికి దాన మివ్వడం ఆయన పరశురామునికి రాజ్య బహిష్కరణ విధించడం జరుగుతుంది. దానితో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాడు పరశు రాముడు.
అయితే ఈనాడు పెరిగిపోతున్న అవినీతి అధర్మాన్ని చూస్తూ దక్షత కలిగిన నీవూ అలా తపోదీక్షతో హిమాలయాలపై మౌనంగా ఉంటే దేశమాతను ఎవరు రక్షిస్తారయ్యా.... తపస్సు చాలించి లేచి రమ్మని ఆమంత్రిస్తూ వ్రాసిన కవిత ఇది.
అయితే ఈనాడు పెరిగిపోతున్న అవినీతి అధర్మాన్ని చూస్తూ దక్షత కలిగిన నీవూ అలా తపోదీక్షతో హిమాలయాలపై మౌనంగా ఉంటే దేశమాతను ఎవరు రక్షిస్తారయ్యా.... తపస్సు చాలించి లేచి రమ్మని ఆమంత్రిస్తూ వ్రాసిన కవిత ఇది.
డస్సి పరివార సహితుడై యుస్సురంచు
ఆశ్రమంబును చేరిన అతిథి వరుల
ఆదరించిన మునిధన మపహరించు
ధర్మ హీన కృతఘ్నతాంధ్యమ్ము పైన!
ఆశ్రమంబును చేరిన అతిథి వరుల
ఆదరించిన మునిధన మపహరించు
ధర్మ హీన కృతఘ్నతాంధ్యమ్ము పైన!
సతత పరతత్త్వ శోధనా మతిని యతిని
సాధు జనమాన్యు విజ్ఞాన సార విదుని
సత్య ధర్మ ప్రవర్తనున్ సమయ జేయు
స్వార్ధ హింసాధ్వ గర్జిత శక్తి పైన!
సాధు జనమాన్యు విజ్ఞాన సార విదుని
సత్య ధర్మ ప్రవర్తనున్ సమయ జేయు
స్వార్ధ హింసాధ్వ గర్జిత శక్తి పైన!
ప్రజల మాన విత్త ప్రాణ రక్షణమ్ము
వారి వాగనుసరణమ్ము పాలకులకు
విహిత కర్తవ్య మద్ధర్మ విధి నిబర్హ
ణమ్ము సేయు నిరంకుశత్వమ్ము పైన!
వారి వాగనుసరణమ్ము పాలకులకు
విహిత కర్తవ్య మద్ధర్మ విధి నిబర్హ
ణమ్ము సేయు నిరంకుశత్వమ్ము పైన!
ధర్మ పరశువు చేబూని దర్ప మెసగ
గంధ గజముపై కుఱుకు సింగమ్ము భంగి
నాడు దక్షాధ్వర ధ్వంస నమ్మొనర్ప
యేగు వీర భద్రు పగిది యెగచు వేళ!
గంధ గజముపై కుఱుకు సింగమ్ము భంగి
నాడు దక్షాధ్వర ధ్వంస నమ్మొనర్ప
యేగు వీర భద్రు పగిది యెగచు వేళ!
యో, భార్గవా! యుష్మదీయ....
బ్రహ్మ తేజోదీప్త ఫాల ప్రదేశంబు
రౌద్ర రేఖా భూతి రశ్మి నొప్పె
దండ కమండల మండిత హస్తంబు
ఘోర కుఠారంబు కోరుకొనియె
పరమ కృపావిష్ఠ పద్మ నేత్రంబులు
విస్ఫులింగాభీల వృష్టి గురిసె
నవనీత సన్నిభ ధవళ మనోబ్జంబు
రోష పావక శిఖా భూష దాల్చె
రౌద్ర రేఖా భూతి రశ్మి నొప్పె
దండ కమండల మండిత హస్తంబు
ఘోర కుఠారంబు కోరుకొనియె
పరమ కృపావిష్ఠ పద్మ నేత్రంబులు
విస్ఫులింగాభీల వృష్టి గురిసె
నవనీత సన్నిభ ధవళ మనోబ్జంబు
రోష పావక శిఖా భూష దాల్చె
భవ్య వేదాళి ఘోషించు వక్త్ర మయ్యె
భీషణాట్టహాస ధ్వనీ ప్రేషితముగ
యజ్ఞ యాగాది సత్క్రియార్హంపు క్షితియె
వధ్య శిలయయ్యె దుర్జన భంజనమున!
భీషణాట్టహాస ధ్వనీ ప్రేషితముగ
యజ్ఞ యాగాది సత్క్రియార్హంపు క్షితియె
వధ్య శిలయయ్యె దుర్జన భంజనమున!
తత్సౌరంభంబు నాలించి దివంబున....
ధీరోదాత్త చతుర్విధాంగబల సందీప్తాస్త్ర శస్త్రాది సం
భార ప్రోత్ధిత బాహు వీర్యులు; రణ వ్యాసక్తులౌ రాజులన్
పారుండొక్కడు జంపె సత్వగుణ సంపన్నుండు యుద్ధావనిన్
ఔరా! యెంతటి సాహసంబని సురల్ హర్ష ధ్వనుల్ సల్పుచున్!
భార ప్రోత్ధిత బాహు వీర్యులు; రణ వ్యాసక్తులౌ రాజులన్
పారుండొక్కడు జంపె సత్వగుణ సంపన్నుండు యుద్ధావనిన్
ఔరా! యెంతటి సాహసంబని సురల్ హర్ష ధ్వనుల్ సల్పుచున్!
యొండొరులతో అనుకుంటున్నారట.....
అనిలో నిట్టుల ధర్మ హీన నృప సంహార క్రియాభీల వ
ర్తనుడై యిర్వది యొక్క మార్లు జను సంరంభంబు నెప్పట్టునన్
గన, గన్పట్టునె ధర్మ రక్షణ మహత్కర్తవ్య దీక్షన్ వినా
జనకున్ జంపిన దుర్జనాళిపయి మాత్సర్యంబు మౌనీంద్రుకున్!
ర్తనుడై యిర్వది యొక్క మార్లు జను సంరంభంబు నెప్పట్టునన్
గన, గన్పట్టునె ధర్మ రక్షణ మహత్కర్తవ్య దీక్షన్ వినా
జనకున్ జంపిన దుర్జనాళిపయి మాత్సర్యంబు మౌనీంద్రుకున్!
ధర్మ రక్షణ సలుపు కర్తవ్య దీక్ష
వజ్ర సన్నిభ సంకల్ప బలిమి గాక
రాజసాహంకృతీ ద్యుతిన్ భ్రాంతి చేయు
యుబ్బు యేరీతి విప్రున కబ్బు ననుచు!
వజ్ర సన్నిభ సంకల్ప బలిమి గాక
రాజసాహంకృతీ ద్యుతిన్ భ్రాంతి చేయు
యుబ్బు యేరీతి విప్రున కబ్బు ననుచు!
నిజ స్థానంబుల కరిగిరి.... ఓ భార్గవా నీవూ...
ఘన బాహా బల గర్విత
జనపాల ప్రతతి నోర్చి సాధిత భువికిన్
ముని నాధుండౌ కశ్యపు(
జన నాధుని జేసి రజత శైలంబందున్!
జనపాల ప్రతతి నోర్చి సాధిత భువికిన్
ముని నాధుండౌ కశ్యపు(
జన నాధుని జేసి రజత శైలంబందున్!
శ్రాంతిన్ బొంది, కుఠారమున్ విడి, అహింసా శీలివై త్వత్పరి
శ్రాంతంబైన మనంబు నీశు పద కంజాతమ్ములన్ జేర్చి, యే
వంతన్ జేరగ నీక, దుర్భర తపో వ్యాసక్తతన్ నిల్వ, ని
శ్చింతన్ స్వార్ధ మధర్మమాక్రమణ జేసెన్ భూమి నో భార్గవా!
శ్రాంతంబైన మనంబు నీశు పద కంజాతమ్ములన్ జేర్చి, యే
వంతన్ జేరగ నీక, దుర్భర తపో వ్యాసక్తతన్ నిల్వ, ని
శ్చింతన్ స్వార్ధ మధర్మమాక్రమణ జేసెన్ భూమి నో భార్గవా!
దివ్య భవదీయ విక్రమ దీప్తి కడరి
దుర్మద నిరంకుశ స్వార్ధ దుష్ట శక్తు
లోహ టించెను నాడు; పెల్లుబ్బు చుండె
నీవు లేవంచు నిర్భీతి నేడు, భువిని!
దుర్మద నిరంకుశ స్వార్ధ దుష్ట శక్తు
లోహ టించెను నాడు; పెల్లుబ్బు చుండె
నీవు లేవంచు నిర్భీతి నేడు, భువిని!
అధికార దర్పంబు అక్షిద్వయిన్ గప్ప
మంచి చెడ్డల నాత్మ మరచువారు
ధన మదాంధత చేత ధర్మ చింతన మాని
పరవారి పీడించి బ్రతుకు వారు
ఆర్జిత విజ్ఞాన మటకపై కెక్కించి
పై వారి పదములన్ బట్టు వారు
మధుర భాషణముల మాధుర్యమును జూపి
వెనుక గోతులు దీయ వెదుకు వారు
మంచి చెడ్డల నాత్మ మరచువారు
ధన మదాంధత చేత ధర్మ చింతన మాని
పరవారి పీడించి బ్రతుకు వారు
ఆర్జిత విజ్ఞాన మటకపై కెక్కించి
పై వారి పదములన్ బట్టు వారు
మధుర భాషణముల మాధుర్యమును జూపి
వెనుక గోతులు దీయ వెదుకు వారు
ప్రజల యొక్కయు ప్రజలచే ప్రజల కొరకు
ప్రభుత యను చుపన్యాసముల్ బలుకు వారు
ప్రజల నజ్ఞతా మౌఢ్యంపు వార్ధి ముంచి
భ్రష్ట బాబాల తెర వెన్క బ్రతుకు వారు!
ప్రభుత యను చుపన్యాసముల్ బలుకు వారు
ప్రజల నజ్ఞతా మౌఢ్యంపు వార్ధి ముంచి
భ్రష్ట బాబాల తెర వెన్క బ్రతుకు వారు!
ఇంకా...
ఈ గడ్డపై బుట్టి ఈ సంపదన్ బొంది
పరభావ దాస్యేచ్ఛ బ్రతుకు వారు
వంచనా శీలురై లంచంబులన్ మ్రింగి
దేశాభ్యుదయమునే దెగడువారు
స్వార్ధంబుకై దేశ సౌభాగ్యమున్ వేడ్క
తాకట్టు పెట్టంగ దలచు వారు
జాతీయ భావమ్ము సౌభ్రాతృ తత్త్వంబు
కుల మతమ్ముల పేర కూల్చువారు
ఈ గడ్డపై బుట్టి ఈ సంపదన్ బొంది
పరభావ దాస్యేచ్ఛ బ్రతుకు వారు
వంచనా శీలురై లంచంబులన్ మ్రింగి
దేశాభ్యుదయమునే దెగడువారు
స్వార్ధంబుకై దేశ సౌభాగ్యమున్ వేడ్క
తాకట్టు పెట్టంగ దలచు వారు
జాతీయ భావమ్ము సౌభ్రాతృ తత్త్వంబు
కుల మతమ్ముల పేర కూల్చువారు
ఓట్ల భిక్షాటనార్ధమ్ము యూర యూర
అమిత వాగ్దాన సంతర్పణములు సేసి
కండ బలమును తమదైన కలిమి బలిమి
కడిమి నధికార పీఠాభి గమ్యులగుట!
అమిత వాగ్దాన సంతర్పణములు సేసి
కండ బలమును తమదైన కలిమి బలిమి
కడిమి నధికార పీఠాభి గమ్యులగుట!
ఆధిపత్యమ్ముకై అంగలార్తురె గాని
ఆపన్నులౌ ప్రజా ఆర్తి వినరు
వనితాభ్యుదయమంచు వాదింతురే గాని
అబలల హింసింప నాదుకొనరు
విద్యాఢ్యులీ దేశ విత్త మందురె గాని
అక్షరాస్యత బెంచు దీక్షలేదు
సంస్కార చైతన్య సాధనోక్తులె గాని
ప్రతిభను గుర్తింప పాటుపడరు
ఆపన్నులౌ ప్రజా ఆర్తి వినరు
వనితాభ్యుదయమంచు వాదింతురే గాని
అబలల హింసింప నాదుకొనరు
విద్యాఢ్యులీ దేశ విత్త మందురె గాని
అక్షరాస్యత బెంచు దీక్షలేదు
సంస్కార చైతన్య సాధనోక్తులె గాని
ప్రతిభను గుర్తింప పాటుపడరు
దేశ భద్రత శాంతి సుస్థిరత నిల్ప
ఉగ్రవాదంబు నిర్జించు యుక్తి గనరు
ప్రజల సౌభాగ్య సంపత్తి పరిడవిల్ల
వారి దారిద్ర్యముల్ దీర్చు దారి గనరు!
ఉగ్రవాదంబు నిర్జించు యుక్తి గనరు
ప్రజల సౌభాగ్య సంపత్తి పరిడవిల్ల
వారి దారిద్ర్యముల్ దీర్చు దారి గనరు!
ఇలనిటు నేతలై తులువ లేలగ వేసరి, దుర్భర వ్యధా
కలిత మనస్కయై జనని కన్నుల నీరము లద్దుకొంచు, "ని
ర్మల మహనీయ ధర్మ పరిరక్షణ" దీక్షను బూని రమ్ము, ని
స్తుల తపమింక చాలు నను చున్నది; కన్నులు విప్పు భార్గవా!
కలిత మనస్కయై జనని కన్నుల నీరము లద్దుకొంచు, "ని
ర్మల మహనీయ ధర్మ పరిరక్షణ" దీక్షను బూని రమ్ము, ని
స్తుల తపమింక చాలు నను చున్నది; కన్నులు విప్పు భార్గవా!
కుమతులు ధర్మ విరోధులు
అమితముగా బెరుగ గాంచి అమ్మయె నిన్నున్
తమకంబున బిలిచి నపుడు
హిమవంతము పైన తపము యేలర యింకన్!
అమితముగా బెరుగ గాంచి అమ్మయె నిన్నున్
తమకంబున బిలిచి నపుడు
హిమవంతము పైన తపము యేలర యింకన్!
నెట్టన మోక్ష కాంక్షదగునే? అపవర్గము చేరకున్న నీ
పుట్టి మునుంగునే?కపట బూత మనస్కుల చేత జిక్కి యి
ప్పట్టున దేశ మాతయె విపద్దశ నొందగ చేవ గల్గియున్
దిట్ట తనంబు జూపని త్వదీయ పరాక్రమ మేల భార్గవా?!
పుట్టి మునుంగునే?కపట బూత మనస్కుల చేత జిక్కి యి
ప్పట్టున దేశ మాతయె విపద్దశ నొందగ చేవ గల్గియున్
దిట్ట తనంబు జూపని త్వదీయ పరాక్రమ మేల భార్గవా?!
భీమంబై భువి వెల్గు తామస గుణావిర్భూత దర్పోద్ధతిన్
భూమీదేవ! త్వదీయ బాహు బలమో, భూతేశు కారుణ్య దృక్
శ్రీమంత ప్రతిపన్న శస్త్ర విభవోత్సేకంబొ యోర్వంగ లే
వామంత్రింపుము; త్వన్మహోజ్వల తపో వ్యాకోచ సత్వంబికన్!
భూమీదేవ! త్వదీయ బాహు బలమో, భూతేశు కారుణ్య దృక్
శ్రీమంత ప్రతిపన్న శస్త్ర విభవోత్సేకంబొ యోర్వంగ లే
వామంత్రింపుము; త్వన్మహోజ్వల తపో వ్యాకోచ సత్వంబికన్!
ధర్మ బాహ్యుల గుండియల్ తల్లడిల్లు
సింహనాదంబు నల్ దెసల్ సెలగు చుండ
సమర శంఖంబు పూరించి "స్వధితి" దాల్చి
రమ్ము భార్గవా! మాతృ ఋణమ్ము దీర్ప!
సింహనాదంబు నల్ దెసల్ సెలగు చుండ
సమర శంఖంబు పూరించి "స్వధితి" దాల్చి
రమ్ము భార్గవా! మాతృ ఋణమ్ము దీర్ప!
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment