మంచి సాహిత్యం అంటే ఏమిటి?
ఏ రచన ఐతే మనల్ని మనం సంస్కరించుకొని, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రేరణ నిస్తుందో.... ఏ రచనను అధ్యయనం చేయడంవల్ల సామాజిక స్పృహ, చైతన్యం మనలో అంకురిస్తాయో, ఏ రచన మనలను కర్తవ్యోన్ముఖులను చేస్తుందో ఆ రచన ద్వారా వెలుగు చూసిన సాహిత్యాన్ని మంచి సాహిత్యం లేదా ఉత్తమమైన సాహిత్యం అనవచ్చు.
ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
అలాంటి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.
మొదటిది... ఆనందానుభూతులు కలుగుతాయి.
రెండవది.... అంతరంగంలో ఆవేదనా పూర్ణమైన ఆలోచనలను తట్టి లేపడమే కాక ఆ ఆలోచనలను కార్యరూపంలోకి అనువదించుకునేందుకు కావలసిన నిద్రాణమైన కార్యదీక్షను జాగృత పరుస్తుంది.
మొదటిది... ఆనందానుభూతులు కలుగుతాయి.
రెండవది.... అంతరంగంలో ఆవేదనా పూర్ణమైన ఆలోచనలను తట్టి లేపడమే కాక ఆ ఆలోచనలను కార్యరూపంలోకి అనువదించుకునేందుకు కావలసిన నిద్రాణమైన కార్యదీక్షను జాగృత పరుస్తుంది.
ఆనందం అంటే ఏమిటి?
నిజానికి ఆనందం అనేది మన మనస్సులో కలిగే ఒక స్ఫందన. బాహ్య-అంతర విషయాలకు మనస్సు స్ఫందించే విధానాన్ని అనుసరించి మనలో కలిగే భావోద్వేగాలు వివిధ భంగిమలలో వ్యక్తమౌతుంటాయి. కష్ట నష్టాల పరిమితులలో కనిపించే స్ఫందన ఒక రకమైనది కాగా దానికి భిన్నమైన పరిస్థితులకు కలిగే స్ఫందన సంతోషాన్ని (Pleasure), ఆనందాన్ని(Happiness), తాదాత్మ్యతను (Blissful state), తన్మయతను (Ecstacy) ఇస్తుంది. సంతోషానికి, బాహ్యంగా జరిగే ఏదైనా ఒక అనుభవం కారణమవుతుంది. కాగా ఏ అనుభవాన్నైనా నిర్మాణాత్మకంగా స్వీకరించేందుకు సన్నద్ధమైన మానసిక స్థితి ఆనందాన్నిస్తుంది. కర్తవ్య నిర్వహణా దీక్షతో సాగిపోయే క్రమంలో ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలను సమంగా తీసుకోగలిగిన మానసిక స్థితి తాదాత్మ్యత నిస్తుంది కాగా ఏ పరిస్థితిలోనైనా ఫలితంపై ఆపేక్షలేకుండా జాగృత స్థితిలో చైతన్యవంతమైన వ్యక్తి పని చేస్తూ ఆ పనిని తప్ప అన్య భావనలకు స్ఫందించని వికసిత మానసిక స్థితి తన్మయ స్థితి గా చెప్పుకుందాము.
ఇందులో ఉత్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆనంద స్థితిని పొందుతాము. ఆ మానసిక స్థితి కలిగించిన ప్రేరణ వల్ల చేసిన సాధన వల్ల అత్యున్నత స్థితికి ఎదుగ గలుగుతాము.
ఇందులో ఉత్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆనంద స్థితిని పొందుతాము. ఆ మానసిక స్థితి కలిగించిన ప్రేరణ వల్ల చేసిన సాధన వల్ల అత్యున్నత స్థితికి ఎదుగ గలుగుతాము.
నిజంగా సాహిత్యం చదవగానే ఆనందంగా ఉంటామా?
అలా అని ఏ సాహిత్యమూ ఎవరికీ హామీ నివ్వదు. అంతేకాదు, ఏ సాహిత్యం కూడా ఇలా ఉంటే ఆనందంగా ఉంటారనే రెడీమేడ్ ఫార్ములాను ఇవ్వదు. ఇంకా ఆనందంగా ఉంటామా, బాధామయ ప్రపంచంలోనే విహరిస్తుంటామా అనేది వ్యక్తిగత ఎన్నిక మాత్రమే. ఉత్తమ సాహిత్యం సమస్యల వలయంలో చిక్కుకున్న వ్యక్తికి ఊరట నిస్తుంది. వాటిని పరిష్కరించుకునే దిశలో కావలసిన ప్రేరణ నిస్తుంది. నిజానికి సమస్య ఎప్పుడూ మనలో అంతర్గతంగా నిగూఢంగా ఉన్న పరిణతిని పెంచుతుంది. వైవిధ్యభరితమైన మార్గాలను చూపించి ఎన్నుకునే స్వేచ్ఛను మాత్రం మనకే వదిలేస్తుంది. అంతేకాక పరిష్కారాలను కనుగొనేందుకు క్షణం నిలువనీయకుండా మనల్ని తొందరిస్తుంది.
ఈ క్రమంలో పేరు ప్రఖ్యాతులకు ప్రాకులాడకుండా, నిరంతరం ప్రేరణ నివ్వగలిగిన ఉత్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, బోధ పరచుకోవడం, ఆచరణలో పెట్టి అవగతం చేసుకోవడం వల్ల పొందిన జ్ఞానాన్ని వికాసాన్ని ప్రచారం చేస్తూ ఆ అభ్యుదయ మార్గంలో నడవాలనుకునే జిజ్ఞాసువులకు మార్గ దర్శన చేయడం వల్ల మన జీవిత సందర్భమే మారిపోతుంది. సమన్వయత సాధించడం అలవడుతుంది. ముఖ్యంగా దేనికోసం దేనిని త్యాగం చేయాలి అనే విచక్షణ పెరుగుతుంది.
No comments:
Post a Comment