శ్రీ గురుభ్యో న్నమః
అజ్ఞతా చిహ్నము "గు"కార మట్టి దాని
గడచు జ్ఞాన చిహ్నంబు "రు" కార మంద్రు
అజ్ఞతాంధ్యమ్ము బాపి సత్యాధ్వమందు
జ్ఞాన దీప్తిని దయచేయు యనుడె గురువు!
గడచు జ్ఞాన చిహ్నంబు "రు" కార మంద్రు
అజ్ఞతాంధ్యమ్ము బాపి సత్యాధ్వమందు
జ్ఞాన దీప్తిని దయచేయు యనుడె గురువు!
సహనావవతు యన్న సమభావనా పూర్ణ
సత్సాంప్రదాయంపు సార మలది
ప్రేయస్సు నెడబాపి శ్రేయస్సు సమకూర్చు
దివ్య విజ్ఞానంపు దీక్ష నొసగి
వినయ వివేకాది వితరణ గుణభూతి
చేతంబులన్ నిండ జేర దీసి
సౌశీల్య విశ్వాస సత్య నిష్టల బెంచు
శిక్షా విధానంపు చెలిమి నిచ్చి
సత్సాంప్రదాయంపు సార మలది
ప్రేయస్సు నెడబాపి శ్రేయస్సు సమకూర్చు
దివ్య విజ్ఞానంపు దీక్ష నొసగి
వినయ వివేకాది వితరణ గుణభూతి
చేతంబులన్ నిండ జేర దీసి
సౌశీల్య విశ్వాస సత్య నిష్టల బెంచు
శిక్షా విధానంపు చెలిమి నిచ్చి
విద్య గరుపంగ గురువులీ విశ్వమందు
పరిణతిన్ బొంది మనజాతి పంచిపెట్టె
విహిత సంస్కార చైతన్య విమల దీప్తి
మహి సమస్తంబు శోభాయమాన మవగ!
పరిణతిన్ బొంది మనజాతి పంచిపెట్టె
విహిత సంస్కార చైతన్య విమల దీప్తి
మహి సమస్తంబు శోభాయమాన మవగ!
పరిసరాలోకనా ప్రాపిత విజ్ఞాన
శోధనమ్మున ఆత్మ శుద్ధి నంది
సతతంబు నియమాను సారమా విజ్ఞాన
సాధన జేయుచు సార మరసి
శోధనా సాధనా స్ఫూర్తి శిష్యుల దేర్ప
బోధనా శీలురై బుద్ధి గరిపి
సంస్కార చైతన్య సౌశీల్య దీప్తుల
వ్యక్తిత్వ నిర్మాణ పథము చూప
శోధనమ్మున ఆత్మ శుద్ధి నంది
సతతంబు నియమాను సారమా విజ్ఞాన
సాధన జేయుచు సార మరసి
శోధనా సాధనా స్ఫూర్తి శిష్యుల దేర్ప
బోధనా శీలురై బుద్ధి గరిపి
సంస్కార చైతన్య సౌశీల్య దీప్తుల
వ్యక్తిత్వ నిర్మాణ పథము చూప
త్రివిధ ధన యుక్తులై యొప్పి అవని మీద
జాతి నిర్మాణ నేతలై సాగువారె
గురువు లన జెల్లు! చెల్లునే గురువు లనగ
విద్య నమ్మెడి అక్షర విదిత జనుల!
జాతి నిర్మాణ నేతలై సాగువారె
గురువు లన జెల్లు! చెల్లునే గురువు లనగ
విద్య నమ్మెడి అక్షర విదిత జనుల!
వట తరుచ్ఛాయలో బ్రహ్మ తేజోదీప్తి
శోభిల్లు పిన వయస్కుండె "గురువు"
ఆచార్యు ముంగిట అతి భక్తి నియతులై
చెలువారు వృద్ధులె శిష్య గణము
ఆధ్యాత్మ తత్త్వమ్ము వ్యాఖ్యానమును చేయ
జ్ఞాన ధనుడు పూను మౌన ముద్ర
అతి రహస్యమౌ ఆ భావ మెద చేర్చి
సంశయములు శిష్య చయము బాయు
శోభిల్లు పిన వయస్కుండె "గురువు"
ఆచార్యు ముంగిట అతి భక్తి నియతులై
చెలువారు వృద్ధులె శిష్య గణము
ఆధ్యాత్మ తత్త్వమ్ము వ్యాఖ్యానమును చేయ
జ్ఞాన ధనుడు పూను మౌన ముద్ర
అతి రహస్యమౌ ఆ భావ మెద చేర్చి
సంశయములు శిష్య చయము బాయు
ఆ గురువె దత్తనాధుండు; అంత వారె
శంకరాచార్యులాది శిష్యౌఘ మనగ
అట్టి గురు శిష్యులీ భూమి నవతరించి
రెందరో ఆ పరంపర కివియె నతులు!
(చిత్రం వట తరోర్మూలే వృద్ధా శ్శిష్యాః గురుర్యువాః
గురోః మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయః అన్న ఈ శ్లోకానికి స్వేచ్చానువాదం చివరి పద్యం)
శంకరాచార్యులాది శిష్యౌఘ మనగ
అట్టి గురు శిష్యులీ భూమి నవతరించి
రెందరో ఆ పరంపర కివియె నతులు!
(చిత్రం వట తరోర్మూలే వృద్ధా శ్శిష్యాః గురుర్యువాః
గురోః మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయః అన్న ఈ శ్లోకానికి స్వేచ్చానువాదం చివరి పద్యం)
No comments:
Post a Comment