సనాతన ధర్మం - హిందూ మతం (ధర్మం)
సమ కాలీన సమాజపు పోకడలను, చరిత్రను పట్టిచ్చేది ఆయా కాలాలలో వెలుగు చూచిన సాహిత్యమే. ప్రతి జాతికి ఒక సంస్కృతి ఉంటుంది, జీవన గతులు ఉంటాయి. భారతీయ సమాజం యొక్క సంస్కృతి సనాతన ధర్మం పునాదులపై నిర్మింప బడింది. సనాతనం అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం. ధర్మం అంటే ప్రజలను రక్షించేది. మార్గ దర్శన చేసేది, శాసించేది. సనాతన ధర్మం అనుసరింపబడిన రోజులలో భారతీయ విజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా ఆదరించబడింది. భారత దేశంలో ఈనాడు అమలులో ఉన్న విద్యా విధానానికి రూపకల్పన చేసిన లార్డ్ మెఖాలే ఫిబ్రవరి 2, 1835 నాడు బ్రిటిష్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగంలో ఇలా అంటాడు...
“నేను భారత దేశం నాలుగు వైపులా ప్రయాణించాను అయినా ఎక్కడ కూడా భిక్షగాండ్లను గానీ, దొంగలను కానీ చూడలేదు. అనంతమైన భౌతిక సంపదను, సమున్నతమైన నైతిక విలువలతో కూడిన శీల సంపదను, అత్యున్నత సామర్ధ్యంతో నైపుణ్యంతో కూడిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను చూచాను. ఈ నేపథ్యంలో అమితమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన భారతదేశం యొక్క వెన్నుముకలను అన్ని పార్శ్వాలలో విరిచి వేయకుండా ఏ నాటికీ ఆ జాతిని జయించ గలమని నేననుకోవడం లేదు. అందువల్ల భారతదేశ ప్రాచీన విద్యా విధానం, సంస్కృతుల కన్నా పాశ్చాత్య విద్యా విధానం, ఆంగ్ల భాష, సంస్కృతులు గొప్పవని వారిని నమ్మించగలిగితే వారు తమ ఆత్మగౌరవం కోల్పోతారు, అలా ప్రతిక్షేపించ గలిగితే వారు తమ జాతీయ సంస్కృతికి దూరమౌతారు దానితో మనం ఎలా కోరుకుంటున్నామో అలా జరుగుతుంది, అంతే కాదు, ఆ జాతిపై నిజమైన ఆధిపత్యాన్ని సాధించ గలుగుతాము.”
ఇది సనాతన ధర్మాచరణ నాటి భారతదేశ స్వరూప స్వభావలపై, ఈ జాతి మూలాలను ఛేదించాలని వచ్చిన విదేశీ సామ్రాజ్యవాదుల అభిప్రాయం.
[I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is thief such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break every backbone of this nation, which is her spiritual and cultural heritage and therefore, I promise that we replace her old ancient education system, her culture for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native culture and they will become what we want them, a truly dominated nation. (Lord Macaulay's Address to the British Parliament on 2nd Feb 1835, The Truth About India)]
క్రీ. పూ. 8275 సంవత్సరాలకన్నా ముందునుండి నిరంతరాయంగా, నిరాటంకంగా నడుస్తున్న భారత దేశ చరిత్రలో సనాతన ధర్మమూలాలను శ్రద్ధగా పరిశీలిస్తే (ఈ దేశ సంస్కృతి కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉందని సంప్రదాయం చెపుతున్నా, మనకు తెలిసిన చరిత్ర ప్రాతిపదికగా) మానవ జీవన విధానాలను, మూలాలను, మూల్యాలను ఆవిష్కరిస్తున్న సాహిత్యం చాలా పెద్ద మొత్తంలో వెలువడిన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక సమాజంలో ఒక కాలంలో నెలకొన్న అవసరాలకు కొంత కాలం తరువాత మరిన్ని చేర్పులు అవసరం కావచ్చు. కొన్ని ఆచార వ్యవహారాలు ఆనాటి సమాజానికి పనికి రాకపోవచ్చు. అలాంటి వాటిని నిరుపయోగమైనవిగా ప్రక్కకు పెట్టవలసి రావచ్చు లేదా కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి రావచ్చు. అలాగే ఆచరణలో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవలసి రావచ్చు. ఇవన్నీ నిరంతరం జరగవలసిన ప్రక్రియలు. ఈ దేశ సాహిత్యంలో అవి జరిగాయి కూడా. (Required Additions, Deletions, Modifications and Corrections are made continuously to our literature and culture) అందుకే మన సాహిత్యం చాలా పెద్ద మొత్తంలో లభ్యమౌతుంది.
ప్రాచీన భారతదేశ సంస్కృతిలో నా అభిప్రాయమే నిశ్చితమైనది, నా మార్గమే ఒప్పైనది అనే భావనకు చోటులేదు. ఎవరో గొప్పవారు మాత్రమే సాహిత్యాన్ని సృష్టి చేయాలనే నియమమూ లేదు. ఎవరైనా తమ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా వెలువరించవచ్చు. అనుభవపూర్వకమైన, పరిశోధనా పూర్వకమైన విజ్ఞానం అర్హత ప్రాతిపదికగా అందరికి అందించబడింది. ప్రాకృతిక సమాచారాన్ని అందిపుచ్చుకొని దానిని పలు కోణాలలో పరిశీలించి వడగట్టి విజ్ఞానంగా మార్చుకొని దానినీ మరింతగా శోధించి వడగట్టి వివేచనగా మార్చుకొని, ఆ వివేచనను ఆచరణలో పెట్టుకొని అనుభవంగా మలచుకొని ఆ అనుభవాన్ని జీవితానికి అన్వయించుకొనడం వల్ల సమగ్రమైన సంపూర్ణమైన జీవన వికాసాన్ని సాధించ గలిగారు, సనాతన ధర్మాన్ని ఆచరించినవారు. అందుకే జీవితం తయారు చేసుకునేది కాదు అనుభవ పూర్వకమైనది అంటారు.
అలాంటి దేశీయ సంస్కృతి సాహిత్యాలలో ఈనాడు విషం కలపబడింది. ప్రాచీన సాహిత్య రీతులను తప్పుడు అన్వయాలతో విశ్లేషించి ప్రజల మధ్య వైరుధ్యాలను రెచ్చగొట్టే సాహిత్యం వెలుగు చూస్తుంది. వర్గాలనీ, కులాలనీ, ప్రాంతాలనీ విభేదాలను రెచ్చగొడుతూ తమకు ప్రయోజనకారిగా కీర్తి ప్రతిష్ఠలను తెచ్చేదిగా ఉండే సాహిత్యాన్ని వ్రాస్తూ ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాలలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే రచయితలు బయలుదేరారు. సామాజిక ఉద్యమాల పేరుతో కుల మతాల కుళ్ళులో సృజింపబడిన సాహిత్యం ద్వారా విద్యార్థుల మనసులలో విషాన్ని నింపే దుస్సంస్కృతి ఈ నాడు నెలకొన్నది. దీనికి పలు విద్యా సంస్థలలో, విశ్వవిద్యాలయాలలో మంచిని బోధించాల్సిన ఆచార్యులే అభ్యుదయం పేరుతో శ్రీకారం చుట్టడం నిజంగా బాధాకరమైన విషయం.
ప్రాచీన సాహిత్యం అంతా ఒక కులాధిపత్య ధోరణిలో సృజింపబడిందనే భావజాలాన్ని వ్యాపింపచేస్తూ పరిణతి లేని పాఠక వర్గాన్ని సమగ్ర సాహితీ విలువలకు దూరం చేస్తున్నారు. మేధావులు సైతం పేరు ప్రఖ్యాతులకోసం కానీ ఏదో ఇజానికి బంధీలవడం వల్ల కాని ఇలాంటి సాహిత్యాన్ని సృజిస్తూ విభేదాలను మరింత వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి అవకాశవాదులచే సృజింపబడిన సాహిత్య రీతులు ఆలోచనకు పెద్దపీట వేయక పోవడం వల్ల పాఠకుల స్థాయి పెరగడం లేదు. సాహితీ విలువలను మదింపు చేయవలసిన ముఖ్యమైన కేంద్రాలలో రాజకీయం చోటుచేసుకోవడం వల్ల పైరవీలతో పురస్కారాలను పొందడం, కీలక పదవులను (అర్హత లేకున్నా) సాధించుకోవడం కనిపిస్తుంది. అంతేకాదు... పత్రికా రంగంలో కూడా వస్తున్న పెను మార్పులు సాధారణ పాఠకుని స్థాయి అంటూ చవకబారు సాహిత్యాన్ని ప్రచురించడం... సాధారణమై పోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచు కోవాలి. పెట్టుబడిదారుల వర్గంపై పోరాటం అంటూ వ్రాస్తున్న రచనలు ప్రచురిస్తున్నదీ పెట్టుబడిదారులే. వారు తమకు వ్యతిరేకమైన రచనలను తమ పత్రికలలో ఎందుకని ప్రచురిస్తున్నారు? అంటే అలాంటి సాహితీ సృజన వల్ల వారికి ఎలాంటి నష్టం జరగదనే నమ్మకమే కాక ఆ రచనల వల్ల వారి అమ్మకాలు మరింతగా పెరగడమే. వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న వారు, విశ్వ విద్యాలయాలలో ఆధ్యాపకులుగా పనిచేస్తున్న వారు, అంతర్జాతీయ సంస్థలలో నిర్వాహకులుగా పనిచేస్తున్న వారు లక్షల రూపాయలు జీత భత్యాలు తీసుకుంటూ వర్గ పోరాటాల గూర్చి మాట్లాడడం విడ్డూరంగా కన్పిస్తుంది.
సిద్ధాంతాలు ప్రాతిపదికగా రావలసిన రచనలు కూడా అవకాశవాదాన్ని ఆలంబనగా చేసుకోవడం వల్ల నాలుగు కాలాలపాటు నిలబడ గలిగిన సాహితీ సృజన మృగ్యమై పోయింది.

ఈ రచనకు ముగింపు మరొక సారి......
No comments:
Post a Comment