ఓం శ్రీ సరస్వత్యై నమః
లక్ష్య సాధనకు అవసరమైన విధానం ఏమిటి?
ఇంద్రుడు స్వర్గలోకాధిపతి. అతని వద్ద కల్పతరువు ఉంది, కామధేనువు ఉంది, చింతామణి ఉంది, అక్షయ పాత్రా ఉంది. తనకు ఏ నిమిషంలో ఏది కావలసి వచ్చినా కోరుకున్నంత మాత్రాన అన్నీ సాకారమౌతావి. అయినా నిరంతరం వ్యగ్రతా మనస్కుడై ఉంటాడు. తన పదవికి ఎవరు ఎప్పుడు ఎక్కడినుండి ఎసరు పెడతారో అని భయాందోళనల మధ్య బ్రతుకుతుంటాడు. తన శక్తియుక్తులపై తనకే విశ్వాసం లేదు. తనచుట్టూ ఉన్న వారినీ నమ్మలేడు. తన వద్ద ఉన్న సంపద (స్వర్గ భోగాలు కావచ్చు, ఆధిపత్యం కావచ్చు) పరాధీనమౌతుందోననే అభద్రతా భావనతో ఉంటాడు. నిరంతరం లక్ష్మీ దేవి వెంట పరుగులు తీసే ఇంద్రుని వైపు లక్ష్మీదేవికి ఆకర్షణ లేదు.
మరొక వైపు విష్ణుమూర్తి హాయిగా తామరాకుపై యోగనిద్రలో ఉంటాడు. పాల సముద్రంలో శేష శయనుడై నిరంతరం ఆనందంగా ఉంటున్న విష్ణువును సేవిస్తుంటుంది లక్ష్మీ దేవి. తనకు సంపదపై మమకారం ఏమీ లేదు అయినా తనను వీడి లక్ష్మీ దేవి ఉండలేదు. భక్తులూ అతనిని ఆధారపడ దగిన నమ్మకస్తుడూ, తమ కష్టాలను తీర్చ గలవాడని నమ్ముతారు.
దీనిని అర్థం చేసుకోవాలంటే ఒక పిరమిడ్ ను చూడండి. క్రింద ఒక పెద్ద వరస ఉంటుంది, వారిపై మరొక వరస, ఆపై మరొకటి...ఆపైన ముగ్గురితో మరొకటి ఆపై ఒకరు నిలుచుంటారు. చూడడానికి చక్కగానే ఉంటుంది కాని దాని వెనుక ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం చాలా గొప్పది. అందరికన్నా పైన ఉన్న వ్యక్తి విజయం సాధించాలి అంటే క్రింది వ్యక్తులు సమర్థవంతులై ఉండాలి. వారి సహకారం పూర్తిగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే అందరి కన్నా పైన ఉన్న ఉండే వ్యక్తి క్రింది వారందరికీ ఆమోదయోగ్యుడై ఉండాలి, అతనిపై నమ్మకం ఉండాలి. అతను సాధించగలడు, అతనిపై ఆధారపడితే తమను విజయపథంవైపు నడిపించగలడని అందరూ విశ్వసించాలి. అందరి కన్న పైన ఉండే వ్యక్తి క్రింది వారిని అందరినీ భగవంతులుగా చూడగలిగిన మానసిక స్థితిని పొందగలిగితే తాను ఆ కార్యానికి యజమానిగా నిలువ గలుగుతాడు.
ఇంద్రుని వద్ద అప్సరసలు ఉంటారు. వారు అత్యంత మనోహరంగా నాట్యం చేస్తూ ఉంటారు. వారిని ఇంద్రుడు ఇతరుల తపస్సును భగ్నం చేసేందుకు వినియోగిస్తుంటాడు. అంటే అప్సరసల అందచందాలు, శక్తి సామర్థ్యాలు ఇంద్రుని స్వార్థానికై మాత్రమే వినియోగించ బడుతున్నాయి. ఇంద్రుని పదవిని కాపాడడమో, అతని సంపదను కాపాడడమో లక్ష్యంగా అప్సరసలు వారి శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తున్నారు.
ఇక విష్ణుమూర్తి, తానే స్వయంగా మోహినిగా మారి అర్హత లేనివారికి అమృతం అందకుండా చేసాడు. మరొక సమయంలో, కర్తవ్యాలను అన్నింటినీ విడిచి పెట్టి కైలాసశిఖరాన తపోసమాధిలో మునిగి ఉన్న శివుడిని వారణాసికి తెచ్చేందుకు వినియోగించాడు. శివ శబ్ధం ఆనందానికి చిహ్నం. నిరీహుడై, ఏ కోరికల వలయానికీ చిక్కకుండా తపస్సులో మునిగి ఉన్న శివుడు ఆనందమయుడు కావడం వల్ల తనకు ఏ అవసరాలు లేకపోవచ్చు కాని అంతటి సమున్నత స్థితిలో లేని ప్రపంచానికి అన్నీకావాలి. విభూతి శివుని వద్దే ఉంది. కాబట్టి తాను మోహినిగా మారి శివుడిని శంకరునిగా (మంగళకరుడు) మార్చి అన్నపూర్ణ సాహచర్యంతో వారణాసిలో వసించేట్లుగా చేసాడు, విష్ణువు.
ఈ రెండింటినీ సరైన కోణంలో ఈనాటి సామాజిక అవసరాలకు అన్వయించుకుంటే, ఒక వ్యాపారవేత్త తన వినియోగదారుని ఎలా చూడాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. వినియోగదారుడు, తనకంపనీలో పనిచేసే ఉద్యోగికావచ్చు, తనకు ముడిసరకునందించే అమ్మకందారూ కావచ్చు, పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారు కావచ్చు, అనుమతులనిచ్చే ప్రభుత్వం కావచ్చు. తన వ్యాపార పరిధిలో ఉండే ప్రతి వ్యక్తినీ భగవంతునిగా చూస్తూ గౌరవిస్తూ, ఆరాధిస్తూ ఉండే వ్యాపారవేత్త విజయద్వారం వద్ద ఉన్నట్లే. అతడే యజమానిగా పిలువబడుతాడు.
ఇంద్రునికి లేనిదీ, విష్ణువుకు ఉన్నది ఈ అవగాహనా పూర్ణ అంతరం మాత్రమే. దీని వల్లే లక్ష్మీ దేవి విష్ణువు హృదయ వాసిని అయింది. లక్ష్యమే లక్ష్మి అనుకుంటే ఆ సాధనకు ఉపయుక్తమయ్యే ఒక మార్గమే ఈ అవగాహన.
కృతజ్ఞతలు.
పాలకుర్తి రామమూర్తి
9441666943

No comments:
Post a Comment