ఏ యూరు వాసయోగ్యం?
ధనికః, శ్రోత్రియో, రాజా, నదీ, వైద్యస్తు పంచమః
పంచ యత్ర
నవిద్యంతే న తత్ర దివసే వసేత్!
చాణక్య
నీతి 1- 9
ఏ యూరిలో
నైతే ధనికుడు, శ్రోత్రియుడు, రాజు,
నదులు, వైద్యులు ఉండరో ఆ యూరిలో ఒక రోజు కూడా
ఉండ కూడదు అంటారు, చాణుక్యులు. మనం చిన్నప్పుడు
సుమతీ శతకంలో కూడా ఇలాంటిదే ఒక పద్యం నేర్చుకున్నాం కదా....
అప్పిచ్చువాడు
వైద్యుడు
ఎప్పుడు
ఎడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూర
నుండుము
చొప్పడ
కున్నట్టి యూర( జొరకుము సుమతీ!
ఒక
వ్యక్తి ధనవంతుడు కావాలి అంటే; వ్యాపారం
చేయాలి. వ్యాపారం చేయాలి అంటే వ్యాపారానికి అనువైన వాతావరణం ఉండాలి. వస్తు
ఉత్పత్తి జరగాలి. దానికి అవసరమైన వనరులు
అందుబాటులో ఉండాలి. రహదారులు, రవాణా సౌకర్యం ఉండాలి. కమ్యునికేషన్
వ్యవస్థ ఉండాలి. తయారైన వస్తువులు
వినిమయం కావాలి. వినిమయం కావాలి అంటే ప్రజలలో కొనుగోలు శక్తి ఉండాలి. ఇవన్నీ ఎక్కడ
ఉంటాయో అక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. గౌరవ ప్రదమైన జీవన యానానికి లోపం
ఉండదు. అవసరానికి అప్పు లిచ్చి ఆదుకునే
వారికి లోటుండదు. కాబట్టి ఆ యూరు నివాసయోగ్యం.
శ్రోత్రియుడు...
అంటే శ్రుతి తెలిసిన వాడు. శ్రుతి అంటే వేదము. వేదమంటే తెలుసుకొనడం. ఏది తెలుసుకోవాలి? అంటే... ఏదైతే సమాజానికి హితకరమో, మానవ జీవనానికి ఉపయోగకరమో, దేని
ద్వారానైతే ధర్మం ఆచరించ బడుతుందో, ఏదైతే అపారమైన మానవ మేధకు
పదను పెట్టగలదో దానిని తెలుసుకోవాలి. దానినే వేదము లేదా
శ్రుతి అంటారు. ఎవరైతే ఆ వేదాన్ని నిరంతరం అభ్యసిస్తూ, అధ్యయనం చేసిన దానిని అర్హులైన అర్ధులకు
అందిస్తూ విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తాడో అతడే శ్రోత్రియుడు. విజ్ఞానం కలిగిన
వారు, మంచి చెడ్డల మధ్య భేదాన్ని తెలియ జాలిన వివేచన గలిగిన
వారు ఉన్న యూరిలో శ్రేయస్సు, ప్రేయస్సుకు మార్గం కనిపిస్తుంది.
శాస్త్ర సాంకేతిక ప్రగతి అక్కడ ఉంటుంది.
కష్టకాలంలో సలహాలు లభిస్తాయి. కాబట్టి ఆయూరు వాసయోగ్యం.
మానవాభ్యుదయానికి
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అత్యంతావశ్యకమైనది. భూమి,
శ్రమ లేదా శ్రామికులు, ఆర్ధిక వనరులు మరియు
ప్రణాళికాబద్ధ యోజనా నిర్వహణలు; ఈ నాలుగు ప్రధాన భూమికలుగా
వ్యవసాయం లేదా పరిశ్రమలు లేదా సేవారంగాలు పనిచేస్తాయి. వీటన్నింటికి రక్షణ నిచ్చే
వ్యవస్థ రాజ్య వ్యవస్థ. దానికి అధిపతే రాజు.
కాబట్టి, ... రాజును రక్షణకు ప్రతీకగా గుర్తిస్తాం. అన్నీ ఉన్నా రక్షణ
లేకపోతే, భయం రాజ్యమేలుతుంటే బ్రతుకు దుర్భర మౌతుంది.
అన్యాయం జరిగిన వేళ దుర్మార్గాన్ని అణిచివేసి బలహీనులకు రక్షణ నివ్వగలిగిన మానసిక
స్థితి క్షాత్రం. ఎవ్వరిలో నైతే క్షాత్రం ఉంటుందో అతడు ఇతరులకు రక్షణ సమకూర్చ
గలడు. బలం బలాన్ని గౌరవిస్తుంది. గౌరవాన్నందుకున్న బలం ఆపన్నులను ఆదుకుంటుంది.
అలాంటి రాజరిక వ్యవస్థ ఉన్న యూరిలో ఉండడం వల్ల నిర్భయంగా ఉండగలుగుతాము.
నదులు...
జలం ప్రాణదాయిని. సాగునీరు, త్రాగునీరు ఉన్నచోట జీవనం సాఫీగా
సాగిపోతుంది. నాగరికతలన్నీ నదీ పరీవాహక ప్రాంతాలలోనే విరిసాయి. వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలకు మూలాధారం నీరే. ఆ నీటి వ్యవస్థ
ఎక్కడ ఉంటుందో అక్కడ నివసించడం ఉత్తమం ఉంటారు, చాణక్యులు.
వైద్యులు...
ప్రాణదాతలు. రోగాల బారిన పడడం ప్రతి జీవికీ సహజం. చావును ఆపలేకపోయినా వీలైన మేరకు
వైద్యులు ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. అందుకే.. మన నివాస స్థానంలో తప్పని
సరిగా అనుభవజ్ఞులైన వైద్యులు ఉండే విధంగా చూసుకోవాలి.
సుమతీ
శతక కర్త కూడా పై అంశాలనే ప్రాతిపదికగా ఏది వాసయోగ్యమో ఏది కాదో చెప్పాడు.
పాలకుర్తి
రామమూర్తి
No comments:
Post a Comment