మనసా చిన్తితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్
మన్త్రేణ రక్షయేత్ గూఢం కార్యా చాపి నియోజయేత్!
అంటాడు, చాణక్యుడు.
మనసులో
ఏ కార్యాన్నైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనలను ఎవరి దగ్గరా ప్రస్తావించ వద్దు. అంతే కాదు, మంత్ర సమానంగా రహస్యంగా ఆ అలోచనలను
కాపాడాలి. ఎందుకు? అంటే... ఆలోచనలకు కార్య
రూపాన్నిచ్చేప్పుడు ఎవరైనా అవరోధాలు కల్పించ వచ్చు. సాఫల్యత జరగక పోతే అపహాస్యం
చేయవచ్చు. అంతేకాదు ఆలోచనలను అమలు చేసినప్పుడు అందరూ అబ్బుర పడతారు, గుర్తింపూ వస్తుంది. కార్య భంగం కాదు. కాబట్టి
ఆలోచనలను విశ్లేషణ చేసుకొని కార్య నిర్వహణా
ప్రణాళికను రచించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం ఉత్తమమని చాణక్య నీతి
చెపుతున్నది.
ఒక హాల్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒక సదస్సు జరుగుతుంది. అందులో చాలా
చురుకైన సౌందర్యవతి యైన ఒక అమ్మాయి
పాల్గొన్నది. క్రియాశీలకంగా ప్రవర్తిస్తూ, అందరినీ
ఆకట్టుకుంటున్న ఆ అమ్మాయిని ఒక యువకుడు చూచాడు.. మొదటి చూపులోనే ఆమెను
ప్రేమించాడు. ఆమె అందానికి మోహితుడైన ఆ యువకుడు ఆమె వద్దకు వెళ్ళి "నేను
నిన్ను ప్రేమిస్తున్నాను" నీకు సమ్మతమైతే పెళ్ళి చేసుకుంటానని చెపుతాడు. ఆమె
ఆర్థిక యోజనా, ప్రణాళికా రంగంలో నిష్ణాతురాలు కాబట్టి…
ఆ అబ్బాయిని అడుగుతుంది. మంచిదే కాని నీ ఆర్థిక స్థితి గతులను
గూర్చి కుటుంబ పూర్వాపరాలను గూర్చి చెప్ప మంటుంది. ఆ యువకుడంటాడు, ఇప్పుడు నేను తండ్రిచాటు బిడ్డడినే,
సామాన్యుడినే... కాని కొన్ని నెలల తదుపరి కోటీశ్వరుడి
నౌతానంటాడు. ఎలా అని అడుగుతుంది, ఆ
అమ్మాయి. అతనంటాడు, నాతండ్రి జబ్బుతో తీసుకుంటున్నాడు బహుశా
కొద్ది నెలలలో అతడు మరణిస్తాడు, తదుపరి అతని ఆస్తి
మొత్తానికి అంటే దాదాపు రూ. 300 కోట్లకు నేనే అధిపతి నౌతానంటాడు. ఆ మాటల కా
అమ్మాయి ప్రభావితమౌతుంది, ఇరువురు వారి అడ్రసులు, ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు.
రోజులు గడుస్తున్నాయి, ఆ అబ్బాయి ఊహాలలో
తేలిపోతున్నాడు. ఇలా ఉండగా, చాలా కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి ఆ ఇంట్లో
కోడలిగా అడుగు పెట్టింది.
కాని, ఆ అబ్బాయికి భార్యగా కాదు, సవతి తల్లిగా. పెట్టుబడి మార్కెట్ రిస్క్ పై ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలను,
ప్రణాళికలను కార్యరూపం దాల్చక ముందే ఇతరులతో పంచుకుంటే ఫలితం
తారుమారయే ప్రమాదం ఉంటుంది.
No comments:
Post a Comment