హస్తీ స్థూలతనుః స చాంకుశ వశః కిం హస్తి
మాత్రో౨ఙ్కుశో
దీపే ప్రజ్వలితే ప్రణశ్యతి తమః కిం దీప మాత్రం
తమః
వజ్రేణాపి హతాః పతంతి గిరయః కిం వజ్ర మాత్రం
నగాన్
తేజో యస్య విరాజతే సబలవాన్ స్థూలేషు కః
ప్రత్యయః!
11-3
అంటాడు చాణక్యుడు.
బాగా బలీష్ఠమైన ఏనుగు చిన్న అంకుశానికి లొంగుతుంది. ఏనుగు పరిణామం ఎంత?
అంకుశం అరిణామం ఎంత? చిన్న దీప వెలిగితే తమము (చీకటి) పారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా
పరుచుకున్న చీకటి పరిణామం ఎంత? చిన్ని దీపం పరిణామం ఎంత?
చేత ధరించ గలిగిన వజ్రాయుధం దెబ్బకు పర్వతాలు పడిపోతున్నాయి. పర్వత
పరిణామం ఎంత? వజ్రాయుధ పరిణామం ఎంత? దేనికైనా
తేజస్సు (పరాక్రమమే) ముఖ్యం కాని దేహ బలం దానికి ప్రత్యామ్నాయం కాగాజాలదు.
చాలామంది
శ్రేష్ఠతా సాధనను చాలా పెద్ద సమస్యగా భావిస్తారు. కాని యాజమాన్య నిర్వహణా రంగ
పరిశోధకులు, బోధకులు సాధారణమైన కృత్యాలను
అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో నిర్వహించడం శ్రేష్ఠత అని చెపుతారు. ప్రయోజనం ప్రభావం;
ఈ రెంటి మధ్య సంబంధం సరిగా అవగాహన చేసుకో గలిగితే శ్రేష్ఠతను
సాధించడం కష్టతరం కాదని యాజమాన్య నిర్వాహక నిపుణులు చెపుతున్నారు. రాశి కన్నా వాశి
మిన్న. పరిమాణానికన్నా పరిణామం మిన్న అన్న విషయానికి ప్రాధాన్యత నిస్తే యోగ్యత
మరియు పరిపూర్ణతలను సాధించగలుగుతాము. అదే శ్రేష్ఠతగా అవతరిస్తుంది. పైన ఉదహరించిన
అంకుశం కాని, దీపం కాని,వజ్రాయుధం కాని
ఈ యోగ్యతా పరిపూర్ణతలకు ప్రతీకలుగా తీసుకుంటే జీవన గమనంలో మనమెలాంటి
వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలో అర్థం అవుతుంది.
ఆంగ్లంలో Too big
to hit is too big to miss అనే సామెత ఉంది. భయపడితే సమస్య లన్నీపెద్దవిగానే
కనబడతాయి. సమస్యలను ఎప్పుడైతే సవాళ్ళుగా స్వీకరిస్తామో ఆ సమస్యల పరిష్కారానికి
అన్ని మార్గాలను అన్వేషిస్తాము.... సాధిస్తాము. అందుకే దేహ బలానికన్నా బుద్ధి బలం
గొప్పదనే సామెత వచ్చింది.
No comments:
Post a Comment