Tuesday, May 30, 2017

What is the purpose of life?

What is the purpose of life?

Before going into the subject, let me be clear that I am not preaching but I am trying to share my understanding with you regarding the subject.
The basis of our understanding is Knowledge. Then what is knowledge?
The data we collect from the entire existence and convert it into fragmented information. Then the fragmented information is defragmented and arranged systematically so that it is precipitated as knowledge. The knowledge when applied and tested transforms into wisdom.
For example; Good, bad, Rama, is, boy, girl, a… something like that is called the data. We acquire the data from our surroundings. When we assemble this data into a meaningful form, that data becomes information. “Rama is Good, Rama is bad, Rama is a boy” When it is defragmented and systematized as per our perception, the information becomes Rama is a good boy or a bad boy. Then we are applying and testing whether Rama is good or bad it gives a clarity i.e. wisdom. Up to knowledge we are dependent but by acquiring wisdom we become independent. Once our intelligence is ignited we try to assimilate the knowledge and wisdom we become interdependent. 
A book gives us information. When the information is digested it becomes knowledge and practice blesses us with wisdom.
Normally, it is said that we are human beings. But, Osho says that “we are not beings but becomings”. Being is static and becoming is dynamic. Frankly speaking the becoming is also the part of being, because the “being” represents the entire existence and everything is part of it.
So, we are dynamic and the basic nature of dynamism is to achieve something always. Therefore, it is preached that achieving is success but not achievement.
So the purpose of LIFE is achieving something till our last breath no matter whether it is small or big. What to do or achieve is our choice which decides our role in this planet. But doing should be our character or nature.
Every human, by nature would like to lead a Purposeful Life, a Peaceful Life, a Meaningful Life and a Fruitful Life. But it is not displayed in everybody’s life. Why? Because, to understand the essence of the life, we need to invite certain additions, deletions, modifications and corrections, into our life but we are not doing that. How it is done? It is done by listening, watching, discussing and thinking. Listening to the great thinkers preachings, watching silently the happenings and observing the great people’s habits, discussing (not arguing) the subject with enlightened people and thinking from the angle of  our natural acceptance.
Most of us, we are operating our life through our Preconceived notions. We acquire such preconceived notions from our family, teachers, society, books, preachings or from our experiences. We make certain presumptions and do not allow our mind to think beyond it. Our thoughts, our desires and our expectations are under some limitations and under the control of our preconceived notions. We are limiting our beliefs to the letter of the scriptures and forgetting the spirit of the scriptures. So it is creating confusion in our mind.
"స్వధర్మో నిధనం శ్రేయం, పర ధర్మో భయావహ" అంటుంది, భగవద్గీత. ఎంత గొప్పదైనా పరధర్మాచరణ భయప్రదమైనదే. మనధర్మాచరణలో మరణం సంభవించినా మేలు. ఇది ఆ మాటల కర్ధం. కాని పరధర్మం అంటే ప్రలోభాలచేతగాని, భయం చేతగాని ఏ పని చేయడమైనా పరధర్మాచరణగానే భావించాలి. అలాగే మన అంతరాత్మ ప్రబోధానుగుణంగా నిర్వహించే పని స్వధర్మంగానే భావించాలి. ఇప్పుడు అదే శ్లోకాన్ని నిర్వచించుకుంటే... ఎవరో చెప్పారని ఏదో వస్తుందని చేయడం కాదు, ఏం చేయాలనుకున్నా అది నీ అంతరాత్మ ప్రబోధానుగుణంగా చేయమనే ప్రబొధ అర్ధం అవుతుంది.
Actually, we need to understand the purpose from our natural acceptance. And it should be verified whether it is giving mutual happiness or not i.e. happiness to our self and others. When it passes through, these two tests that becomes realisation. Realisation gives us clarity i.e. a real understanding.
But most of us, most of the times accept that realisation and practice from preconceived notions. That is happening. For example when someone asks us “everybody is to be respected or few are to be respected” we say every one is to be respected but in practice we do not respect everyone. We have our own reservations.
We cannot be desire less or we cannot be silent. But, our desires and our activities can be purified. So the purification of our desires, thoughts and expectations is the purpose of our life.
          Emerson says that the purpose of life is not to be happy. It is to be useful, to be honorable, to be compassionate, and to have it to make a little difference that you have lived and lived well.
          The utility is the measuring jar of the purpose. The utility of a pen is to write irrespective of its cost. Whether you purchase it for Rs. 3 or Rs. 30000, that doesn’t matter, but it should write. So utility is the second one in defining the purpose of life. So use it or lose it, which is our option. 
          Normally, we are more attached to our success or failure. We are annoyed with our failure and enjoy our success. We become over enthusiastic and stake without anticipating the repulsions, in both the cases.
            "కర్మణ్యేవాధికారస్తే మాఫలేషుకదాచన" అంటుంది, భగవద్గీత. కర్మల నాచరించుట యందే మనకధికార మున్నది కాని దాని ఫలితములపై మన కధికారము లేదు.  మన పని మనం నిబద్ధతతో చేస్తూ వెళ్ళడమే మంచిది. దానికి నిర్దేశితమైన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. దీనిని విశ్వసించాలి. కాని విశ్వసించం.
            The centre of operation of life should be the “TRUST” and the periphery should be the “DOUBT”. But we operate it in reverse.
            Much we are focusing on the result and ignoring the process which is distracting our attention and even our perception. Detachment in attachment is the third aspect of our purpose of Life.
          What we are today is the gift of the society. So, we should show our gratitude towards the society. Whatever, we could, we should give to the society. This is the forth face of the purpose of life.
          Purpose is followed by the performance. Performance is the output of our intensions. When our intensions are good, our competence will increase. Otherwise it will decrease. So always we should try to purify our intensions.
Normally, we display three types of personalities. What we believe ourselves,(Capacity) What the society endorsed with,(Adopted) Our real SELF(Potentiality).
          The purpose of Life is to realise our real nature, to realise our origin, to utilise the instrument i.e. our body in a right way to reach our destiny.
          Our Upanishads say that we have come from the first and foremost energy which is omnipresent, omnipotent and omniscient. Therefore, we are not created by the god but manifestation of the Ultimate. So we have acquired all the qualities that a god or the almighty or the ultimate possess. The difference is that we are covering such qualities under certain coverings like EGO (Edging God Out), hatred, arrogance and selfishness etc. Once we dis-cover our coverings, we understand the purpose of life. Learning and understanding how to discover is the process or the journey we undertake.
So our journey is… అసతోమా సద్గమయ, తమ సోమాజ్యోతిర్గమయ, మృత్యోర్మా౨మృతంగమయ i.e. from nonexistence to existence, from ignorance to enlightenment and from mortality to immortality.
Right utilisation of instrument can only add life to our AGE. The birth and death are not in our hands. But between these two ends there is a life and that is in our hands. I mean how best we can live we can decide, we can plan and execute.
As per Indian philosophy, the result of the “karma” we have to experience. Though, it is inevitable, there is an option that we can enjoy the result or envoy the result. Perception matters much in the process.
Chankya says” …
ఏక ఏవ పదార్ధస్తు త్రిధా భవతి వీక్షతి
కృపణం కామినీ మాంసం యోగిభిః కామిభిః స్వభిః!
                                                                                                            చాణక్య నీతి- 14-16
            వస్తువు ఒకటే... కాని చూచే వారి దృష్టిని బట్టి వివిధ రూపాలుగా కనిపిస్తుంది. స్త్రీ మూర్తి ఒకటే.. కాని యోగులకు ఆమె శరీరం తమ సాధనా మార్గంలో అవరోధంగా ప్రతిబంధకంగా కనిపిస్తుంది. అలాగే కాముకునికి అనుభవించ దగిన భోగ్య వస్తువుగా కనిపిస్తుంది. అదే ఒక కుక్కకు ఆరగించదగిన మాంసం ముక్కగా కనిపిస్తుంది. స్త్రీ మూర్తి ఒక్కటే ఒకరికి తల్లిగా, ఒకరికి భార్యగా, మరొకరికి చెల్లిగా, ఒకరికి కూతురిగా ఇలా ఎన్నో రూపాలలో కనిపిస్తుంది.
          Once there were three people engaged in the construction of a temple. One trespasser stopped and asked the first person “What are you doing”? It was hot summer and the person was tired in his work so annoyed and replied “Are you blind or what, I am earning my livelihood”. The same question, the trespasser, put to the second person. He said”. It is my responsibility to feed my family for which I need to work and I am working. When the same question put to the third person, he replied “I am enjoying the holy work of constructing a temple to my lord. The process I am enjoying and as a bonus, I could feed my family”.
          This is the attitude or the perception of the three people who are engaged in the same work. As per their attitude, they are blessed.
          After certain time the child of the first person became a stone-cutter and second one became an Army officer and third one became a renowned Architect.
The attitude of “doing what we love and loving what we do” would be better and that assures us best utility of the instrument we are blessed with.
          This writing may go up and have no end…
          Our life is a means for us to understand the purpose of our life and make it a fruitful, meaningful and peaceful one. Dropping our ignorance and becoming innocent is better option to understand the underlying concept. Child likeness is always better than childishness. Be a Shiva. That is, which is not is Shiva. It is nothing but ecstasy. Enjoy it.
Wishing every success…..
Palakurthy Rama Murthy

Wednesday, May 24, 2017

The Basis of Humanity.

The Basis of Humanity.

There are two ways that we can lead our LIFE. One is LIVING (bratuku) and the other is LIFE. (jeevitam) Living is adding age to our life and Life is adding life to our Age. Living happens anyway. We need not do anything to live. There are crores of people across the globe taking birth and leaving this universe without any recognition. They don't know how to lead a meaningful, purposeful life and a successful life. They never taste the life they never experience the life. Their, ambitions, expectations and thoughts are rooted through their preconceived notions. Always they run after pleasures and neglect the happiness. And just like that they come to this planet and go.
But there are few people who know how to transform their living into a meaningful lifr. They not only transforms themselves but inspire other people also to transform and make an impression. They experience each moment of life with wonderment. Their expectations, their thoughts and their ambitions are filtered through their realisation, understanding. The basis of their understanding is mutual happiness. They never run after pleasures or happiness. They do their work with devotion and enjoy the result as they are.
Actually they are the transformers. They are the real LEADERS.
The first and foremost quality they display in the process of their transformation is GRATITUDE.
There are three aspects in offering our gratitude.
1) Recognising
2) Remembering
3) Reciprocating.
Recognising the value of life. Recognising the services rendered by others. It may be from our parents, teachers who inspired, may be a real friend who is trustworthy or may be the society. Just saying HEARTFELT THANKS for the help we had with them irrespective of how small it may be. This is expression through words.
Remembering the services we had from others. It may be our parents, friends or society. Offering our heartfelt thanks for the density of the love, affection and concern shown by them towards us. It is an expression of our feelings. i. e. Feeling.
Reciprocating is offering our heartfelt thanks in action for the services rendered by others.
Here whatever we are taking from the society is given back. It is an expression of action.

It is not possible to take, take and take always. We should give back. It is natural phenomenon. It is just like a bank account. Unless we deposit, we can not withdraw.
Try to understand the underlying concept of the life and enjoy the fragrance of offing GRATITUDE.
THANK YOU VERY MUCH.
I invite your comments and angle of perception.
PALAKURTHY RAMA MURTHY, BHONGIR

ఏది ఆచరణ యోగ్యం?

దృష్టి పూతం న్యసేత్ పాదం, వస్త్రపూతం జలం పివేత్,
శాస్త్ర పూతం వదేద్ వాక్యం, మనః పూతం సమాచరేత్!
                                                                        చాణక్య నీతి -- 10-2

            ముందుకు అడుగు వేసేప్పుడు బాగా పరికించి చూసి మరీ అడుగు వేయాలి. నీరు త్రాగేప్పుడు బట్టతో బాగా వడగట్టి శుభ్రమైన నీటినే త్రాగాలి. మాట్లేడేప్పుడు బాగా ఆలోచించి శాస్త్ర సమ్మతమైన విధానంలోనే మాట్లాడాలి. కార్యాచరణలో మనసు చెప్పిన విధంగా మనసుకు నచ్చిన విధంగానే పనులు శ్రద్ధతో ఏకాగ్రతతో ఆచరించాలి, అంటాడు, చాణక్యుడు
            వ్యక్తి జీవితం సార్ధకత సాధించాలి అంటే జీవితంలో ఏదైనా సాధించాలి. నిస్సారమైన బ్రతుకుతో ప్రయోజనమేమీ లేదు. ఏ కార్యమైన నిర్వహించాలి అంటే ముందు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే సమగ్రమైన కార్య స్వరూపం అవగతమైతే అవసరమైన ప్రణాళికలు రచించుకోవచ్చు. చాలా సులువైన పని..... నానుండి కాదని విడిచిపెట్టడం. కాని దానిని తుది దాకా నిర్వహించు కోవడంలోనే వ్యక్తి యొక్క మానసిక బలం, చైతన్యం నిరూపిత మౌతుంది. కాబట్టి కార్య రంగంలోకి అడుగు వేయాలి అంటే ఆ కార్య స్వరూప స్వభావాలపై స్పష్టత రావాలి. అందుకే ముందువెనుకలు ఆలోచించి... ఆ కార్య నిర్వహణలో తుది ఫలితం ఏమిటో దర్శించిన పిమ్మటనే ముందడుగు వేయమంటున్నాడు ఆచార్య చాణక్యుడు. కలలు కనండి ఆ కలలు సాకారమయ్యేందుకు కృషి చేయండి, అన్నారుమాజీ రాష్ట్రపతి, డా. .పి.జే అబ్దుల్ కలాంగారు. నిజానికి కలలు కనడం ఆగిపోతే జీవితమే ఆగిపోయినట్లుగా పరిగణించాలి. సాధించగలననే నమ్మకంతో, ఆశతో అణువణువూ ఆ తపనలో దహించుకు పోతూ నిద్రపోనీయని స్థితిలో కనే కలలే కలలు. అంతే కాని సుష్టుగా మెక్కి సుఖంగా పడకపై చేరి గాఢనిద్రలో సుషుప్తిలో వచ్చే కలలు కలలు కావు అవి కల్లలు మాత్రమే
            "శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం" అన్నారు పెద్దలు. ఆ శరీరంలో దాదాపు 70% ఉన్న నీటిని అవసరమైన పరిమాణంలో తీసుకోవడం వల్ల మాత్రమే మన జీవ యాత్ర కొనసాగుతుంది. అయితే నీరు త్రాగడం కూడా ఒక కళయే. ఏ నీటిని త్రాగాలి? స్వచ్ఛమైన నీటిని మాత్రమే త్రాగాలి. నీటిని వడగట్టడం ద్వారా స్వచ్ఛతను సంతరించుకుంటుంది. ప్రాచీన భారతీయ సమాజంలో నీటిని వడగట్టేందుకు బట్టను లేదా చీరను 6 నుండి 8 మడతలుగా చేసి నీటిని వడగట్టేవారు. ఈ విధానం ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో అత్యుత్తమమైన విధానంగా నిరూపితమైంది. కాబట్టి వడగట్టబడిన శుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలిసుఖాసనంలో 90 డిగ్రీల కోణంలో కూర్చొని గ్లాసును నోట కరుచుకొని నెమ్మదిగా చుక్కచుక్కగా చప్పరించి త్రాగాలి. ఎప్పుడు ధారగా పోసుకోవద్దు. ఉదయం నిద్రలేవగానే కనీసం ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. అదీ గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అలాగే భోజనం చేసిన పిమ్మట నలుబది నిమిషాల సమయం ఇచ్చి గోరువెచ్చని నీటిని త్రాగాలి. చల్లని నీటిని వీలైన మేరకు వాడకూడదు. అలాగే నిలుచొని నీరుత్రాగడం కూడా పనికి రాదు. రాత్రి పడుకునేందుకు ముందు ఒక గ్లాసు పరిశుభ్రమైన నీటిని త్రాగడం వల్ల గుండె పోటు సమస్యలను నివారించ వచ్చునంటారు వైద్యులు. మరొక్క ముఖ్యవిషయం... శరీరం కోరుకోక ముందే (దాహం వేయక ముందే) నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.
            మాట్లాడడం ఒక కళ. అది స్వతహాగా రాకున్నా... కష్టపడైనా అభ్యసించి అలవాటు చేసుకోవాలి. తుపాకీ గుండు ఎలాగైతే బయటికి వస్తే వెనిక్కి తీసుకోలేమో అలాగే మాటనూ వెనిక్కి తీసుకోలేము. శాస్త్రం శాసిస్తుంది. ఏది మాటాడేందుకు యోగ్యమైనదో ఏది అయోగ్య మైనదో నిర్దిష్టంగా చెప్పేదే శాస్త్రం. మాటలతోనే సామ్రాజ్యాలను గెలవవచ్చు కోల్పోవనూ వచ్చు. ఒకసారి నాలుకతో దంతాలు అన్నాయట... మేము తలచుకుంటే నిన్ను నలిపేయగలమని. నవ్వుతూ నాలుక అన్నదట.. నేను ఒక్క మాట మాట్లాడితే మీరు 32 మందీ రాలిపోతారని. మాటకున్న శక్తి అలాంటిది. అందుకే బాగా విచారించి శాస్త్ర సమ్మతమైన మాటలను మృదువుగా, తగిన అంతరాలలో, మార్దవంగా మాట్లాడేవారికి విజయ సాధన కరతలామలకం.
            మనస్సు చెప్పిన విధంగా ఆచరణ ఉండాలి. మన ఆంతశ్ఛేతనకు భిన్నంగా ప్రవర్తిస్తే అలజడికి గురౌతాము. అలజడి ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. దానితో కార్య స్వరూపాన్ని సరిగా అంచనా వేయలేము. అందువల్ల ప్రణాళికలో లోపం ఏర్పడి ఆచరణ తప్పుతుంది. కార్య భంగం అవుతుంది. మరి అంతశ్చేతనకు ప్రాతిపదిక ఏది? సామాజిక ప్రయోజనం, మనకు ఎదుటివారికి ఆనందం కలగడం. ప్రలోభాలకు లొంగి పనిచేయడం లేదా భయపడి పని చేయడం వల్ల మనసును ఆ కార్యంపై వంద శాతం లగ్నం చేయలేము. అలాచేయడం పరధర్మంగా చెప్పబడుతుంది. మన అంతశ్చేతన సూచితఅ మార్గంలో వెళ్ళడం స్వధర్మంగా చెప్పబడుతుంది. గీతలో చెప్పిన విధంగా పరధర్మమెప్పుడూ భయావహమే.
            ఇలా చిన్న శ్లోకం ద్వారా అనల్పమైన జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు, ఆచార్య చాణక్యులు.
            శుభం భూయాత్
పాలకుర్తి రామమూర్తి

Monday, May 15, 2017

ఇతరుల కష్టాలు పట్టించుకొనని వారు



ఇతరుల కష్టాలు పట్టించుకొనని వారు

రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ కంటకాః!
            అంటాడు, చాణక్యుడు.                                                                    చాణక్యనీతి 17-17

            రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు మరియు గ్రామ కరణం... ఈ ఎనిమిది మందికీ ఇతరులు ఏ పరిస్థితులలో ఉన్నారనే ధ్యాస ఉండదు. ఎదుటి వారి బాధలను అర్థం చేసుకోలేరు అంటారు, చాణక్యులు.
            రాజుకు సాధారణంగా కష్టాలు దుఃఖాలు తెలియవు. స్వయంగా దుఃఖం ఏమిటో అనుభవించని వానికి ఎదుటి వారి కష్టం అర్ధంకాదు కదా. అంతేకాదు, నిరంతరం రాచకార్యాలలో మునిగితేలే వానికి కొంత కఠినంగా ఉండవలసిన అవసరమూ ఉంటుంది. రాజుల మనస్సు దారుణా ఖండల శస్త్ర తుల్యం, మాట మాత్రము నవ్య నవనీత సమానంగా ఉంటుంది అంటారు నన్నయ గారు భారతంలో. ఎదుటి వారి కష్టాలకు కరిగినట్లే కనిపించాలి కాని ఎప్పుడూ కరగిపోవద్దు. ఇతరుల సలహాలు తీసుకోవాలే కాని తన పద్ధతిలో తాను నడవాలి. అందరికీ స్నేహితునిగా నటించాలి కాని గూఢాచారిలా వ్యవహరించాలి. మిత్రులను, బంధుగణాన్ని చివరకు భార్యా పిల్లలను కూడా అతిగా నమ్మవద్దు. దీనినే విరాట పర్వంలో తిక్కనగారు చక్కని పద్యంలో చెప్పారు.
పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్
శత్రుల కా దమ యలుకకు బాత్రము సేయుదురు నిజ శుభస్థితి పొంటెన్!
            తమ ఆజ్ఞను ధిక్కరించిన వారు ఎవ్వరయినా ఏ పరిస్థితులలో ఉన్నా చివరకు తమ సంతానమైనా శిక్షిస్తారే కాని ఎదుటివారి బాధలను దుఃఖాన్ని అర్థంచేసుకొని క్షమించడం జరగదు. రాజకీయాలలో నీతిని పాటించేవారు అరుదుగా ఉంటారు. తమ భద్రత, తమ మేలు లక్ష్యంగా సాగే వారి కార్యాచరణలో శాసన ధిక్కారాన్ని ఏ పరిస్థితులలో కూడ సహించరు.
            వేశ్య... ఆమె వృత్తి విటులను ఆకర్షించడం వారి వద్ధ ధనాన్ని పొందడం. అయ్యో! వారి ఇల్లు నావల్ల గుల్ల అవుతుందే అని బాధ పడుతూ కూర్చుంటే తన వృత్తి సాగదు. కాబట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఎదుటివారి కష్ట నష్టాలతో సంబంధం లేకుండా విటులను ఆకర్షిస్తుంది ధనాన్ని ఆర్జిస్తుంది.
            యమధర్మ రాజు యొక్క కర్తవ్యం ... ఆయువు తీరిన జీవుల ప్రాణాలు హరించడమే. మనకు సంబంధించిన వారు ఏ వయసులో ఉన్నా మనల్ని వీడి అనంత లోకాలకు వెళితే మనకు బాధయే. అయితే మృతుల బంధువులు స్నేహితులు దుఃఖిస్తున్నారని కరుణాయత్త చిత్తంతో కూర్చుంటే తన కర్తవ్య పాలనను యముడు చేయలేడు కాబట్టి ఎదుటివారి బాధలను పట్టించుకోకుండా తనపని తాను చేసుకు పోతాడు. అలా చేయకపోతే పెరిగే జన సాంద్రతకు ఈ భూమండలమే కాదు ఎన్ని భూమండలాలైనా సరిపోవు. ఆహార పానీయాదులకూ కష్టమౌతుంది. అయినా పాత నీరు అలాగే ఉంటే క్రొత్తనీరు వచ్చేందుకు అవకాశం ఉండదు కదా.
            అగ్ని లక్షణం కాల్చడం. అగ్నిని సర్వ భక్షకుడు అంటారు. అన్నింటినీ దహించి వేసే అగ్ని శిఖలకు తరతమ భేదం లేదు. ఎవరి బాధలు, కష్టాలను, దుఃఖాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది.
            చోరులు అంటే దొంగల వృత్తి దోచుకోవడమే. అయ్యో ఈ ఇంటి యజమాని కష్టాలలో ఉన్నాడు ఇతని సంపదను దోచుకో వద్దని అనుకుంటే, జాలి కనికరం ఉంటే తన పని నడవదు. అంతే కాదు ఇతరుల బాధలను అర్థంచేసుకోవడానికి అతనేమీ మహానుభావుడు కాదు కదా. అనుసరించి, అదను చూసి, ఆదమరచిన వేళ దోచుకోవడం అలవాటయిన వాడు ఇతరుల దుఃఖానికి స్పందించే సున్నితత్త్వాన్ని ప్రయత్న పూర్వకంగా నైనా వదలివేస్తాడు.
            చిన్నపిల్లలు తమకు కావలసిన దానిని సాధించుకునే క్రమంలో తామెక్కడ ఉన్నదీ, అడిగేందుకది సరైన సమయమా కాదా, ఎలా అడగాలి అనే విషయాలను పట్టించుకోరు. తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా తాము కోరింది జరిగేదాక హఠం చేస్తారు. అవకాశం ఉంటే గారాబంగా అడిగి సాధిస్తారు. లేదంటే ఏడ్చి, గోల చేసి, పంతం పట్టి, అలిగి అల్లరి చేసి లేదా బ్లాక్ మెయిల్ చేసైనా సాధిస్తారు. ఈ క్రమంలో ఎవరి బాధలనూ వారు పట్టించుకోరు.
            యాచకులు ఎవ్వరినైనా యాచిస్తారు. తమ వృత్తిపరంగా ఎదుటివారు ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారనే విషయం వారికవసరం లేదు. అందరి ముందు చేయిచాచడమే వాడికి తెలిసిన విద్య.
            ఇక చివరగా... గ్రామ కరణాలు... ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి వారి నుండి వీరి నుండి లబ్ధిపొందడమే వృత్తిగా కలిగి కరణీకం చేసే వ్యక్తులకు ఎవరైనా బాధపడతారనే ఆలోచన ఉండదు. వీరికి మిత్రులు శత్రులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. తమ స్వార్థానికి ఎదుటివారిని ఎలా ఉపయోగించుకోవాలో నేరుస్తారు. నమ్మకద్రోహం చేయడం వీరి నైజం. ఈర్ష్యాసూయ  భావాలు కలిగిన వీరు అందరి వద్దా తలలో నాలుక లాగా చనువుగా వ్యవహరిస్తూ  అవకాశం రాగానే ఎదుటి వారిని ముంచివేసే ప్రయత్నం చేస్తారుఎదుటివారి బాధలలో తమ సంతోషాన్ని వెదుక్కునే ఇలాంటి వారిని "గ్రామ కంటకాః" అని సంబోధిస్తాడు, చాణక్యుడు.
            ఇలా చాణక్యులు ఎదుటివారి బాధలను, దుఃఖాన్ని పట్టించుకోని వారిని గూర్చి చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మానవులు మంచికన్నా చెడుకే ఎక్కువగా స్పందిస్తారు. సింహం నోట్లో తలపెడితే ఏమౌతుందో తెలిస్తే దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాము