ఊహా సుందరి పరిణయము
చందురు
జుట్టి కొప్పున విశాలపు కన్నుల దిద్ది కాటుకన్
సుందర
తార హార రుచి శోభిత చారు పయోధరాగ్రయై
అందెలు
ఘల్లుఘల్లుమన అల్లన వచ్చి నిషీధి కన్య ఆ
నందముతో
భువిన్ గలసి నర్తన మాడెడు వేళ; వింటి, నే
మందిర
ప్రాంగణంబున సమంచిత వేదిక విశ్రమించుచున్
మంద
సరాగ గానముల మార్దవమున్, కమనీయ భావనా
స్పందిత
హృద్య నర్తనల సవ్వడి, మంజు విపంచి రావముల్;
తందర
నంత వ్రాల కనుదమ్ములు, గాంచితి చెంగటన్ మనో
సుందరి
వేణి భారము, సుశోభితమౌ స్తన యుగ్మభారమున్,
చిందిలు
మధ్యభాగముల సేవధియై, దరహాస చంద్రికల్
విందులు
సేయ, సందిట నపేక్షిత శీధువు తోడ వచ్చి తా
నిందము
గ్రోలు మంచిడె సహేళి రసార్ద్రతమైన వాతెరన్!
ఆ
సుందరి
అరమోడ్పౌ
కనుదమ్ములన్ మెరయ వ్యక్తావ్యక్త శృంగార భా
వ
రహిస్ఫందిత మానసాంకురిత దివ్యానంద తాదాత్మ్యతల్;
దరహాస
ప్రతిభాసితాస్యమెదలో దళ్కొత్తు స్వీయ ప్రియా
సరసాధిష్టిత
రాగపూర్ణమగు స్వేచ్ఛాప్రోత చాంద్రీ స్థితిన్!
పొలుపారన్
నును సిగ్గుదొంతరల కెంపుల్ లేత చెక్కిళ్ళపై
కలయన్
బూసిన సాంధ్యరాగరుచియై గన్పట్టి చెన్నొందగన్;
పలుకుల్
శర్కర తేనె మీగడలు దివ్యక్షీర యుక్తంబులై
లలిమీరన్
మధు కోకిల స్వరగత శ్రావ్యధ్వనిన్ మించెడిన్!
రసన
మెదనుబ్బు అనురాగ రవళి గతుల
జతులు
పలికించు మోహన స్వరపు మురళి;
ఘ్రాణ
మతి నిర్మలప్రేమ కాకృతినిడు
సకల
సద్గుణ సౌగంధ్య సార మలది!
రదనంబుల్
ధవళాఛ్చ కాంతి యుతమై రాజిల్లు రమ్యాకృతిన్
వదనావిర్భవ
దాడిమీ ఫలగత స్వాయత్త పంక్తిభ్రమన్;
పెదవుల్
బండిన దొండ పండుల రుచిన్ విప్పారు శా
రద
లావణ్యత లీల నుబ్బెడు సుధా స్రస్త స్ఫురత్భాండముల్!
ముఖబింబఛ్చవి
సాంద్ర పంక్తి విలసన్మోద స్మితా పూర్ణమై
నిఖిలోర్విన్
రహిమించు చంద్రకళకున్ గీడ్పాటు సంధించెడిన్;
శిఖ
సంవ్యస్త వినీల నీరద రుచిన్ చెన్నొందు కేశాళికిన్
సఖులై
నిల్వగ రామి తుమ్మెదలెదన్ ధైర్యచ్యుతిన్ గుందెడిన్!
ఫాలభాగంబు
అమృతతత్త్వానుపూర్ణ
లలిత
కమనీయ కాంతి విశ్రాంతవేది;
క్రమ్ము
లేజెమ్మటల్ ప్రీతి గౌగిలించి
పెదవి
చుంబింప నార్ద్రమై ప్రిదులు మనము!
చెవులు
ప్రియ మనోహర వచోస్తేమ మధుర
సరస
సల్లాప లాలిత సరసిజములు;
అమల
తనుఛాయ దిక్సీమ నలుముకున్న
మెఱుపు
దీగల కాంతుల మేలమాడు!
గ్రీవ
ముదాత్త రత్నమణి కీలిత సుందర భూషణాది సం
భావిత
దివ్య శంఖమన భాసిలు చుండగ; దీర్ఘబాహువుల్
భావజ
తంత్రులౌచు శుభ లక్షణ దీప్త సరోజ కాండ లీ
లా
విభవంబు చూపెడు నిరంతర మొప్పెడు దానశీలతన్!
కరతలమ్ములు
నవనీత మరుణ కాంతి
తమలపాకులు
పొదవిన క్రమము జూపు;
నఖము
లాకాస వీధుల నాట్యమాడు
తారకోత్కర
సౌందర్య దర్పమణచు!
పాలిండ్లంచిత
ప్రేమతత్త్వమమృతత్త్వమ్ముల్ హృదాబ్జంబులో
లాలిత్యంబున
దాల్చు నిర్మల పరబ్రహ్మ స్వరూపార్థముల్;
లీలా
కల్పిత నాభి యొప్పు మదిలో ప్రేమల్ పిసాళింపగా
స్త్రీలో
వర్ధిలు ప్రాకృతంబయిన మాతృత్వంపు బంధంబుగాన్!
నడుము, చనుల్ నితంబము ఘనంబుగ గూర్చి విధాత మధ్యమున్
గడపని
వ్రాయ, తత్ప్రబల గాఢత కోర్వమి బొందె శూన్యతన్;
వెడద
నితంబముల్, విరహ వేదన దీర్ప వసంత వేళలన్
కడు
రమణీయ ప్రాకృతిక కల్పనలన్ రహిమించు భావనల్!
అరటి
స్తంబంబు లనజెల్లు నామె తొడలు;
పాద
యుగ్మంబు పురివిప్పి పరవశమున
ఆడు
నెమలుల నటనల నలతి సేయు;
గమన
భంగిమ హంసల గర్వ మణచు!
అలాంటి
సౌందర్యరాశియైన....
ఇందునిభాస్య
కౌగిలిని, యీప్సిత శీధు రసంపు మాధురిన్,
చందన
చర్చలన్, మధుర సంగమమున్, రతి
పారవశ్యమున్,
నందన
మందు పూపొదల నట్టున, మల్లెల మత్తునందు నే
దందడి
బొందితిన్ ప్రణయ తత్వ రసాంబుధి నోలలాడితిన్!
పాలకుర్తి
రామమూర్తి
భువనగిరి
No comments:
Post a Comment